![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -122 లో.. నా ముందు మాట్లాడానికి భయపడేది అలాంటిది ఎలా మాట్లాడుతుంది చూడు.. ఒకవేళ మనం అభితో కలిసి ప్లాన్ చేసి కిడ్నాప్ చేసిన విషయం తెలిసి ఉంటుందా.. ఒక్క రోజులోనే ఈ మార్పు ఏంటని సందీప్ తో శ్రీలత అంటుంది. ఈ విషయం ఒక్క రామలక్ష్మి వరకే తెలిస్తే ఫుడ్ అయినా దొరుకుతుంది. అదే బావ గారి వరకు తెలిస్తే పరిస్థితి ఏంటని శ్రీవల్లి అనగానే.. నువ్వు నోరు మూసుకొని ఉండు అని శ్రీలత కోప్పడుతుంది. అసలు రామలక్ష్మి ఎందుకు ఇలా చేంజ్ అయిందో కనుక్కోవాలని సందీప్ కి శ్రీలత చెప్తుంది.
మరొకవైపు రామలక్ష్మి , సీతాకాంత్ లు స్వామి దగ్గరికి వస్తారు. అలా రామలక్ష్మి పడిపోవడంతో చాలా టెన్షన్ పడ్డానని సీతాకాంత్ స్వామితో అంటాడు. అదంతా ఆ దేవుడి ఆడిన అట.. అందుకే సరిగ్గ పెళ్లి టైమ్ కి రామలక్ష్మి కన్పించకుండా పోయింది. నువ్వు కాపాడి తీసుకొని వచ్చావ్. ఈ జన్మ లో నువు పెళ్లి చేసుకోనని చెప్పావ్.. నేను ముందే చెప్పాను కదా.. మీ ఇద్దరిది ఆ దేవుడు ముడివేసిన బంధమని కానీ ఇప్పటి నుండి అసలు అయిన అగ్ని పరీక్ష మొదలవుతుంది. ఒకరి జాతకం ఒకరికి శ్రీరామరక్షగా పని చేస్తుంది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా.. మీ జాతకం ద్వారా అవి తొలగిపోతాయి. అందుకే మీరు ఒకరి చెయ్యి ఒకరి వదలకూడదు. నీ భర్తకి నువ్వే కొండత అండ.. నీ భర్తని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. నీకు అర్థం అయిందా అని రామలక్ష్మితో స్వామి అనగానే.. అభితో శ్రీలత మాట్లాడిన మాటలు గుర్తుకుచేసుకుంటుంది. నువు సౌభాగ్యలక్ష్మి వ్రతం చేయమని రామలక్ష్మికి స్వామి చెప్తాడు. మీరు అభిషేకం చేయించుకొని వెళ్ళండని స్వామి చెప్తాడు.ఆ కపటదారి సవతి తల్లి కుట్ర నుండి ఈయన్ని కాపాడుకోవాలి. అందుకు శక్తిని ఇవ్వమని రామలక్ష్మి మొక్కుకుంటుంది. పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. మా అమ్మ వాళ్ళని కూడా పిలవాలి. అమ్మ వాళ్ల ఇంటికి వెళదామని రామలక్ష్మి అనగానే .. సీతాకాంత్ సరే అంటాడు.
రామలక్ష్మి వాళ్ళు వెళ్తుంటే సుజాతనే గుడిలో ఎదరుపడుతుంది. దాంతో ఇప్పుడు ఎలా ఉన్నావని రామలక్ష్మిని సుజాత అడుగుతుంది. రేపు ఇంట్లో పూజ చేస్తున్నాం.. తప్పకుండా రమ్మని సుజాతకి రామలక్ష్మి చెప్తుంది. తప్పకుండా వస్తామని సుజాత అంటుంది. మరొకవైపు అసలు స్వామి శ్రీలత గురించి చెప్పి ఉంటాడని శ్రీలత , సందీప్ లను శ్రీవల్లి భయపెడుతుంది. అప్పుడే రామలక్ష్మి సీతాకాంత్ లు వస్తారు. రామలక్ష్మి మాత్రం గుమ్మం దగ్గరే ఆగిపోయి.. అత్తయ్య గారు నిన్ను ప్రమాదం నుండి బయటపడ్డాను. నన్ను అసలు పట్టించుకోవడం లేదు.. దిష్టి తియ్యలేదని రామలక్ష్మి అనగానే.. అవునని పెద్దాయన అంటాడు. ఇక ఏం చెయ్యలేక వెళ్లి హారతి తీసుకొని రా అంటు శ్రీవల్లికి శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |